ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణానికి స్త్రీ శక్తి స్కీమ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణానికి స్త్రీ శక్తి స్కీమ్ ఇచ్చిన జీవో.
జీవో నెంబర్.27 తేదీ. 11/8/25.
తెలుగుదేశం ప్రభుత్వం తన ఎన్నికల హామీలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని మహిళల ఉచిత ప్రయాణానికి ఈ జీవోను ఇచ్చినది.
దీని గైడ్లైన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1) ఈ పథకం 15/8/25 తేది నుంచి అమల్లోకి వస్తుంది.
2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాలికలు, స్త్రీలు, మరియు ట్రాన్స్ జెండర్ లకు తగిన ఐడెంటిటీ ప్రూఫ్ తో ఈ పథకం ఐదు రకాల బస్సులలో అమలు అవుతున్నది.
3) ఐదు రకాల బస్సులు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఉచితంగా ప్రయాణించవచ్చును.
4) ఈ స్కీము సప్తగిరి ఎక్స్ ప్రెస్ లు,అల్ట్రా డీలక్స్ లు, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్లు మరియు అన్ని రకాల ఏసీ బస్సులు,నాన్ స్టాప్ సర్వీసులు,అంతర్రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులు,చార్టెడ్ సర్వీసులు మరియు ప్యాకేజ్ టూర్ బస్సులకు వర్తించదు.
5) ప్రస్తుతం ఉన్న బస్సులలోనే ఈ స్కీము అమలవుతున్నది. స్కీం అమలైన తర్వాత పరిస్థితిని బట్టి, ప్రయాణికుల సంఖ్యను బట్టి రాబోయే రోజుల్లో అదనపు బస్సులు కొంటారు.
6) ఇందుకోసం మహిళా కండక్టర్లకు body -worn కెమెరాలు కొనిస్తారు. మరియు అన్ని బస్సులలో సీసీ కెమెరాలు బిగిస్తారు.
7) బస్టాండ్లలో ప్రయాణికుల కోసం ఫ్యాన్లు,కుర్చీలు,మంచినీటి వసతి మెరుగైన టాయిలెట్ వసతి కల్పిస్తారు.
8) ఈ స్కీమ్ ను మంత్రివర్గ నిర్ణయాన్ని బట్టి విద్యుత్ బస్సులకు కూడా భవిష్యత్తులో వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
9) ఉచిత మహిళ ప్రయాణానికి ఇచ్చే జీరో టిక్కెట్ల సొమ్మును ఏపీఎస్ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.
![]() |
స్త్రీ శక్తి స్కీమ్ G.O PAGE-1 |
![]() | |
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి