నేను RTC డ్రైవర్
*నేను RTC డ్రైవర్ ను*
నేను పెద్దగా చదువుకోలేదు,
కానీ ప్రతి ఉదయం కొన్ని వేల మందిని ఉన్నత విద్య కోసం వారి విద్యాలయాలకు సమయానికి పంపాలనే తాపత్రయం నాది... ఎందుకంటే
*నేను RTC డ్రైవర్ ను*,
ప్రతిరోజు వందల కిలోమీటర్లు బస్సు నడిపి బక్క చిక్కిన ఎముకల గూడు నాది, అయినా సరే ఒంటి చేత్తో వంద మంది ఎక్కిన బస్సును గమ్యం చేర్చే నేర్పు నాది... ఎందుకంటే
*నేను RTC డ్రైవర్ ని*
ఇంట్లో సమస్యలు ఇబ్బంది పెడుతున్న, ఒంట్లో సమస్యలు నన్ను ఓపిక లేకుండా చేస్తున్న, నా డ్రైవింగ్ సీట్ ఎక్కగానే 16 ఏండ్ల పడుచు కుర్రోడిని అయిపోత, ఎందుకంటే.....
*నేను RTC డ్రైవర్ ను*
నా పిల్లల భవిష్యత్ కోసం పైసా పైసా పోగెస్తా, నైట్ అవుట్ నరకంలాగ ఉన్నా... MGBS లొ జాలిలేని దోమలు నా ఒంటిని జాలి చేస్తున్న రాత్రంతా వాటితో సహవాసం చేస్త... ఎందుకంటే
*నేను RTC డ్రైవర్ ను*
లోకమంత దసరా, దీపావళి ఆనందంగా జరుపుకుంటున్నారు, కానీ పండగ పూట ఇంట్లో నాన్న లేడు ఎందుకమ్మా ? అని అడిగే నా చిన్నారి తల్లికి తెలియదు, వాళ్ళ నాన్న పండగ పూట బస్సు నడపకుంటే వందల కుటుంబాలకు పండగ ఉండదని,, ఎందుకంటే
*నేను RTC డ్రైవర్ ను*
ఎండాకాలం వేడి ఎంత ఉన్నా అది నా నేస్తమే, ఎంత నేస్తం అయినా ఎందుకో అప్పుడప్పుడు నా అన్నాన్ని పాచిపోయేలా చేస్తుంది, అయినా అలాగే కళ్లుమూసుకొని తినాలి, లేదా మధ్యాహ్నం నీళ్లతో కడుపు నింపుకోవాలి ఎందుకంటే ఒక యాభై కుటుంబాలను గమ్యం చేర్చాలి అంటే ఒంట్లో సత్తువ కావాలి కదా.... ఎందుకంటే
*నేను RTC డ్రైవర్ ని*
నా కళ్లు మసకబారుతున్న నా లక్ష్యం మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది, చలిలో చల్ల గాలి దూరకుండా కట్టిన నా టవల్ మాత్రం నా కండక్టర్ మిత్రుని విజిల్ సౌండ్ కు దారి వదులుతుంది, ఎంతైనా మేము సంస్థకు రెండు కళ్ళం కదా...
*కానీ ఇన్ని చేసిన నాకు*
ఇంజిన్ నా నేస్తమే కానీ దాని వేడితో నా ఎడమ కాలిని కాల్చేస్తుంది, చికిత్స కోసం ADC ని లీవ్ అడగాలంటే భయం,
తార్నాక హాస్పిటల్ లొ డాక్టర్ ని చూస్తే భయం, హే ఎందుకయ్యా నీకు SICK లీవ్, SICK లేదు ఎం లేదు పొ అంటాడేమో అని (అయినా బస్ నడిపేది నేను కదా, ఆ నొప్పి నాకు మాత్రమే తెలుసు)
డిపో లొ ఆఫీసర్ ఎదురైతే భయం KMPL ఎందుకు తక్కువైంది అని అడుగుతారో అని, (50 మంది పట్టే బస్సులొ 100 మందిని ఎక్కించుకొని గేర్ల మీద గేర్లు మారుస్తుంటే KMPL ఎక్కడోస్తుంది అని చెప్పాలనిపిస్తుంది కానీ భయం, నోర్ముయ్ అంటుంది)
నేను గేర్ వేసి బస్ ముందుకు కదిలించనిదే సంస్థ ముందుకు కదలదు, అది అందరికీ తెలుసు అయినా నేనంటే అందరికి చిన్న చూపే,
పోవోయ్, రావోయ్, వెళ్లొయ్, మూసుకొని డ్యూటీ చెయ్యవోయ్ ఇవన్నీ నాకు మామూలు పదాలే, అయినా మనస్సు చంపుకొని డ్యూటీ చేస్తున్న ఎందుకంటే నాకు డ్రైవింగ్ మాత్రమే వచ్చు, ఎందుకంటే...
*నేను RTC డ్రైవర్ ను*
ఒక RTC డ్రైవర్ కొడుకుగా, నాన్న జీవితాన్ని దగ్గరుండి చుసిన అనుభవాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి