APSRTC ఉద్యోగులకు లామినేటెడ్ ID Cards

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ లామినేటెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అందువలన అందరు ఉద్యోగులు మీయొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్  మీ యూనిట్ ఆఫీసులలో 22.10.25 లోపు సబ్మిట్ చేయవలెనని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత ఆఫీస్ వారు ఆ ఫోటోలను 300 KB ఫైల్ సైజ్ ఉండేటట్లుగా Jpg file గా కన్వర్ట్ చేసి వాటిని కాంట్రాక్టర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

FAQ

ప్రశ్నలు-సమాధానాలు

ప్రశ్నలు-సమాధానాలు

APSRTC ఉద్యోగులు వారికి ఎదురయ్యే సందేహాలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకొనవచ్చును.

1. సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి ?

  • సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.
  • అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా,అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం G.O.Ms.No.202 F&P తేది:11.06.1980 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
  • ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.
  • ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.
  • అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి,అట్టి విషయములను సమాంతర(Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి G.O.Ms.No.224 F &P తేది:28.8.1982
  • పుట్టినతేది,ఉద్యోగ నియామకం,తదితర అంశాలకు సంబంధించిన ఉద్యోగి చెంతనున్న వివరాల ఆధారంగా నమోదు చేయవచ్చు. అదే విధంగా కార్యాలయంలోనూ, పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
  • ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల,అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
  • పుట్టినతేది,విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.
  • ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున,శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదేవిధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.

2. Higher Pension అంటే ఏమిటి?

  • సాధారణంగా EPS pensionని ₹15,000 wage ceiling ఆధారంగా లెక్కిస్తారు.
  • కానీ మీరు actual higher salary (Basic + DA మొత్తం) ఆధారంగా contribute చేసి ఉంటే మీకు higher pension వస్తుంది.

    🔹రిటైర్మెంట్ తర్వాత Pension ఎలా వస్తుంది?

  • Form-10D (Pension Claim Form) submit చేయాలి.(లేదా)
  • Onlineగా EPFO portal లో lodge చేయవచ్చు.(లేదా)
  • మీ దగ్గరలోని EPFO regional office కి employer attestation తో offlineగా కూడా apply చేయవచ్చు.

  • 🔹Pension calculation ఇలా జరుగుతుంది.

  • Pension = (Pensionable Salary × Pensionable Service) / 70
  • Pensionable Service = EPF లో ఉన్న మొత్తం eligible service years.
  • Approval అయ్యాక జీవితకాలం పాటు ప్రతి నెల మీ Aadhaar-linked బ్యాంక్ అకౌంట్ లో pension క్రెడిట్ అవుతుంది.

  • 🔹 అవసరమైన Documents

  • Aadhaar,
  • PAN
  • Bank Passbook / Cancelled Cheque
  • Service details (UAN లో ఉంటాయి)
  • Employer attestation (కొన్నిసార్లు తప్పనిసరి)

  • ఇప్పుడు మీకు రెండు options ఉంటాయి: Monthly Pension (Form-10D) — జీవితాంతం వస్తుంది. Spouse/nominee కి కూడా pension కొనసాగుతుంది (family pension).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కారుణ్య నియామకాలు

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం