ఉద్యోగులకు విత్ క్యుములేటివ్ పనిష్మెంట్ల గురించి ఉపయోగకరమైన సమాచారము
ఉద్యోగులకు ఉపయోగకరమైన సమాచారము
ఏపిఎస్ ఆర్టీసీ లో వున్నప్పుడు విత్ క్యుములేటివ్ పనిష్మెంట్ల (With Cumulative,Pay reducation & Afresh Appointments) Relief కై లేబర్ కోర్టులకు ఆశ్రయించేవారము. కాని ప్రభుత్వం లోకి విలీనం అయిన తదుపరి ఆ సౌకర్యము రద్దు కాబడి, హైకోర్టులో అందరి ఉద్యోగుల మాదిరిగా మనము కూడ సర్వీసు మ్యాటర్స్ లో కోర్టులో వ్యాజ్యము వేయాలి. Relief పొందాలి. అందుకుగాను ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా వుండాలి.
- Charge Memo,Charge sheet & Suspension order
- Explanation to the Charge sheet Copy
- Enquiry Report copy
- Show cause notice copy
- Explanation to SCN copy
- Final order copy
- 1st Appeal represented copy.
- 1st Appeal rejected proceedings copy
- 2nd Review petition represented copy.
- 2nd Review petition rejected proceedings.
పై కాపిలను తప్పనిసరిగా పనిష్మెంట్ పొందిన ఉద్యోగులు వుంచుకుని, విజయవాడ హైకోర్టులో వ్యాజ్యం వేసి, రిలీఫ్ పొందవచ్చును. ఇంక్రిమెంట్ చాల విలువైనది ఎవరు కూడ పోగోట్టుకోవద్దని మనవి. చార్జిషీటు నుండి ఇడి అప్పీల్ వరకు ప్రతి పేపరును జాగ్రత్తగా పెట్టుకోవలెను.
కేవలం మీ అవగాహన కొరకు మాత్రమే...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి