APSRTC ఉద్యోగులకు లామినేటెడ్ ID Cards

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ లామినేటెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అందువలన అందరు ఉద్యోగులు మీయొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్  మీ యూనిట్ ఆఫీసులలో 22.10.25 లోపు సబ్మిట్ చేయవలెనని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత ఆఫీస్ వారు ఆ ఫోటోలను 300 KB ఫైల్ సైజ్ ఉండేటట్లుగా Jpg file గా కన్వర్ట్ చేసి వాటిని కాంట్రాక్టర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

10 D ఫారము గురించి

 మిత్రులారా! 10D ఫారము గురించి తెలుసుకుందాము. 

👉1.ఉద్యోగి పెన్షన్ పొందడానికి ఇవ్వవలసిన ఫారము ను 10D ఫారము అంటారు. 

👉2.నెలవారీ పెన్షన్ పొందడానికి ఉద్యోగి సమర్పించవలసిన ఫారమునే 10D ఫారము అంటారు.

 👉3.EPFO సభ్యులైన వారందరికీ  నెలవారి పెన్షన్ మంజూరు చేస్తారు. దీనిలో 2,3 రకాలు ఉన్నాయి. 

👉4.ఉద్యోగి పెన్షన్ పొందాలంటే కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. మరియు 58 సంవత్సరాలు వచ్చి ఉండాలి. 

👉5.ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించి నట్లయితే ఆ ఉద్యోగి యొక్క నామినికి వితంతువు పెన్షన్ ను అలాగే ఉద్యోగి అంకవైకల్యము పొందినట్లయితే అంకవైకల్య పెన్షన్ ను పొందుతారు. కొన్ని సందర్భాల్లో 58 సంవత్స రాలకు పొందవలసిన పెన్షన్ ను 50 సంవత్సరాలకే పొందవచ్చు. దీనిని Reduced పెన్షన్ అంటారు. దీనికి వచ్చే వాస్తవ పెన్షన్ కన్నా తక్కువ వస్తుంది. 

👉 6.EPFO నుండి పెన్షన్ పొందాలంటే ఆ ఉద్యోగి కాని లేక ఆ ఉద్యోగికి సంబంధించిన వారు కాని తప్ప కుండా  ఒక దరఖాస్తు ను EPFO కు ఆన్ లైన్ గాని ఆఫ్ లైన్ లో గాని సమర్పించాలి. 

👉7.మన APSRTC మినహయింపు పొందిన సంస్థ కాబట్టి మన ఉద్యోగులు ఆఫ్ లైన్ లోనే 10D ఫారము నింపి యూనిట్ ఆఫీసర్ ద్వారా ఫిజికల్ గా పంపాలి.

 👉8.ఏ పెన్షన్ అయిన 10D ఫారము లేకపోతే పెన్షన్ శాంక్షన్ కాదు.

👉గమనిక:ఉద్యోగులందరు తప్పని సరిగా నామినేషన్సు ఇవ్వాలి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కారుణ్య నియామకాలు

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం