ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - రథసారధులు - వివరాలు

***" ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో 6 వ నిజాం నవాబు కాలంలో 1899 సంవత్సరం లో "నిజాం స్టేట్ రైల్వేస్ NSR " ఆధ్వర్యంలో కాచిగూడ నుండి మన్మడ్ కి మీటర్ గేజ్ లో రైలు నడిపేది. తదనంతరం తేది 29.08. 1911 నుండి 1948 వరకూ , 7 వ నిజాం గా పరిపాలన చేసిన " మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ " కు తన తల్లి ' జహారున్నీషా బేగం' , తాను నాణేలు సేకరణ అలవాటు లో భాగం గా దాచుకున్న లక్ష వెండి నాణేలు వితరణ చేసి ప్రజలకు రైల్వే తో పాటు బస్సు రవాణా కూడ అందుబాటులోకి తీసుకురావాలని అభిలాష ను కుమారునకు తెలియచేసారు . తల్లి కోరిక మేరకు ఆ సొమ్ముతో 7వ నిజాం , గ్రేట్ బ్రిటన్ నుండి ఓడలు ద్వారా 25 సీట్లు గల 27 అల్బేయన్ పెట్రోల్ బస్సులను ప్రత్యేకంగా తెప్పించారు. 166 మంది సిబ్బంది తో వీటిని నడిపించారు.
*** రైల్వే రవాణా లేని ప్రాంతాలలో మొదట నడపాలి అని నిర్ణయం తీసుకున్నారు. లండన్ నుండి తెచ్చిన బస్సులలో కొన్నింటికి ఆకుపచ్చ, కొన్నింటికి ఎరుపురంగు లు వేయించి ఆకుపచ్చని రంగు బస్సులు సిటీ బస్సులు గా, ఎరుపు రంగు బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో నడుపుటకు నిర్ణయం చేశారు. తల్లి గారి పేరులోని Zahraunnisha మొదటి అక్షరం చిరకాలం జ్ఞ్యాపకం గా ప్రత్యేక రిజిస్ట్రేషన్ సిరీస్ ' Z ' ను నిర్ణయించి , ఆ ప్రక్రియ అమలుచేశారు. 1932 ఏప్రిల్ 18 న హెచ్.వై. జెడ్ 038 నంబరు బస్సును మొదటిగా రిజిస్ట్రేషన్ చేశారు . ఈ బస్సుకు సెల్ఫ్ ఉండేదికాదు. నెట్టడం ద్వారానే బయలు దేరివి . తేదీ 05. 06. 1932 న కాచిగూడ నుండి సిటీ బస్సులు , గౌలిగుడా నుండి జిల్లా బస్సులు ట్రయిల్ గా నడిపించారు. అనంతరం బస్సుల మెయింటెనెన్సు కొరకు బస్సు డిపోల ఏర్పాటు లో భాగం గా తేదీ 15. 06. 1932 న నార్కెట్ పల్లి లో మొదట డిపో ప్రారంభించారు.
*** 1932 లోనే ఖాజీపేట, నాందేడ్, 1934 లో 4 డిపోలు నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబ్ నగర్, 1936 లో 12 డిపోలు హనుమకొండ, యాదగిరి, జహీరాబాద్, పరిగి, మెదక్, ఔరంగబాద్, జలన, ఆసిఫాబాద్, బీడ్, ఉస్మానబాద్, పుర్లే, దేవరకొండ, 1949 లో 2 డిపోలు కరీంనగర్, కొత్తగూడెం ఏర్పాటు చేశారు. 1932 లో 27 బస్సులు 166 మంది సిబ్బంది తో ప్రారంభమై, 1949 నాటికి మొత్తం 21 డిపోలు 952 బస్సులు NSRTD గా విస్తరిల్లింది. 1946 లో హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య 30 డబుల్ డెక్కర్ బస్సులు నడిపారు.
1947 లో స్వాతంత్రం వచ్చినప్పటికీ , నిజాం సంస్థానం 1950 లోనే విలీనం అయింది. అంతవరకూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో ఒక్క బస్ డిపో కూడా లేదు.
*** 1950 లో ఆర్.టి.సి. యాక్ట్ కేంద్రప్రభుత్వం అమలు చెయ్యబడింది. అందువలన అప్పటివరకూ నిజం రాష్ట్ర రైల్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కంపెనీ ని రెండు భాగాలు చేసారు. అలా తేది 01. 11. 1951 న హైదరాబాద్ స్టేట్ లో ప్రత్యేకంగా " రవాణా డిపార్ట్మెంట్ " గా ఏర్పడింది.
1956 లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం వలన తేదీ 11. 01. 1958 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గా ఏర్పడినది.
*** 1965 వరకూ డిపో సెక్షన్ ఇన్ఛార్జ్ ల ఆధ్వర్యంలోనే డిపోలు నడిచాయి. తేది 02.10.1965 నుండి డిపో మేనేజర్, డివిజనల్ కంట్రోలర్ వ్యవస్ధ అమలులోకి వచ్చినది . 1965- 66 లో ఛైర్మెన్ అద్వర్యం లో ఉండేటట్లు విజిలెన్స్ సెల్ ఏర్పడినది. క్రమేణా బస్సుల సంఖ్య పెరగడంతో , టైర్ మెయింటెనెన్సు విభాగం పటిష్ఠపరుచుటకు 1970 హైదరాబాద్ లో టైర్ రిట్రేడింగ్ షాప్ పెట్టారు.
1975 లో ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్లు కోరకు నాగార్జున సాగర్ లో శిక్షణా కాలేజి ఏర్పాటు చేశారు.1975 లో తిరుమల, తిరుపతి దేవస్థానం బస్సులును తీసుకొని సంస్థ నడుపుట ప్రారంభించారు. 1978 లో విశాఖపట్నం, విజయవాడ లలో సిటీ బస్సులు నడపడం ప్రారంభించారు.
*** 2014 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలు విడిపోయిన తర్వాత తేది 02. 06. 2014 రెండు సంస్థలుగా ఏర్పడ్డాయి. కానీ , 1950 ఆర్.టి.సి. యాక్ట్ ప్రకారం తేది 03. 06. 2015 నుండి అధికారం గా " ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ " , "తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ" లు రెండు వేర్వేరు సంస్థలుగా విడిపోయి , వారి వారి బస్సులు నడుపుచున్నాయి.
*** ప్రస్తుతం తెలంగాణ సంస్థ 96 డిపో ల ద్వారా 9, 233 బస్సులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 129 బస్సు డిపో ల ద్వారా 10, 738 బస్సులు వివిధ రూట్లు లో నడుపుచున్నారు.
సంస్థ లో 1958 నుండి 2023 వరకూ మూడు రకాల పరిపాలన సాగింది. (1) 1958 నుండి మే నెల 1966 వరకూ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్లు గా, (2) నవంబరు 1966 నుండి ఫిబ్రవరి 1983 వరకూ జనరల్ మేనేజర్ హోదా తోనూ (3) 1983 నుండి సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లుగా అనేక మంది అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేసి , యూనియన్స్ , సిబ్బంది సహకారం తో సమున్నత స్థాయికి తీసుకువెళ్ళారు. వారి వివరాలు తెలుసుకుందాం.

(1) శ్రీ గురు పెరసాద్ , ICS 1958 నుండి 1962 వరకూ . కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు లో బస్సు రూట్ల జాతీయకరణ తో 01. 04. 1958 న విజయవాడ, 01. 12. 1958 న సికింద్రాబాధ్, 1959 లో మచిలీపట్నం, గుడివాడ, 1960 లో ఏలూరు డిపో తో పాటు 15 డిపోలు ప్రారంభం చేశారు.
(2) శ్రీ వి. పి. రామారావు, ఐఎఎస్, 1962 నుండి 1966 వరకూ . విజయవాడ లో 1963 లో వర్క్ షాప్, హైదరాబాద్ లో ప్రింటింగ్ ప్రెస్ , టైర్ రిట్రీడింగ్ షాప్, బస్ బాడీ యూనిట్, ట్రైనింగ్ కాలేజి ఏర్పాటు జరిగాయి. నవంబర్ 1964 నుండి విజయవాడ , హైదరాబాద్ ల మధ్య దూర ప్రాంత డీలక్స్ , ఎక్సుప్రెస్ సర్వీసులు , వన్ మ్యాన్ సర్వీసులు ప్రవేశపెట్టారు. మచిలీపట్నం నుండి హైదరాబాద్ కు మొదటి నైట్ ఎక్స్ప్రెస్ సర్వీసు ప్రవేశపెట్టారు. తేది 28.01.1963 న జగ్గయ్యపేట డిపో ను ప్రారంభించేరు.
(3) శ్రీ కె . రామచంద్రా రెడ్డి ఐపీఎస్ , 1966 నుండి 1968 వరకూ. వీరి సారథ్యం లో డిపో మేనేజర్ వ్యవస్థ ను పటిష్ఠం , క్రమశిక్షణ పెంపుదల జరిగాయి.
(4) శ్రీ ఎం . ఆర్. పాయ్, ఐఎయస్, 1968 నుండి 1970 వరకూ.
(5) శ్రీ కె . వి. ఎస్. సూర్యనారాయణ ఐఎఎస్ , 1970 నుండి 1973 వరకూ. ఆర్థిక నిర్వహణ , స్లాక్ & పీక్ సీజన్ ఆపరేషన్స్ ఏర్పాటు , సంస్థ కు వూతమిచ్చే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుచేశారు .
(6) శ్రీ అజిత్ సింగ్, ఐఎఎస్ , 1973 నుండి 1975 వరకూ. వీరి పాలనా కాలం లో ఉప విభాగాలు గా ట్రావెల్ , టూరిజం , టైర్ & ట్యూబ్ ఫ్యాక్టరీ , ప్రయాణికుల సౌకర్యం బస్ స్టేషన్లు , షెల్టర్లు నిర్మాణం. విశాఖపట్నం లో 6.74 ఎకరాల విస్తీర్ణం లో , 80 లక్షల అంచనా వ్యయం తో తేది 13.10.1974 న ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంకటరావు చే ద్వారక బస్ స్టేషన్ కి శంకుస్థాపన చేయించారు . నాగార్జున సాగర్ లో ట్రాఫిక్ , మెకానికల్ సూపర్వైజర్ సిబ్బంది కొరకు శిక్షణా కళాశాల ఏర్పాటు చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సులకు ముందు సూపర్ అనే పదం , రంగులు మార్చే ప్రయత్నం చేశారు.
(7) శ్రీ ఆర్. ప్రభాకర రావు , ఐపిఎస్ , 1976 నుండి 1979 వరకూ . ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి ఆలోచన మేరకు రోడ్డున్న గ్రామానికి బస్ రవాణా పర్యవేక్షణ కు , సంస్థ లో రీజనల్ మేనేజర్ వ్యవస్థ ఏర్పాటు , పాలనా మార్పులు చేశారు . ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారిచే ద్వారకా బస్ స్టేషన్ ను ప్రారంభించారు. నేటి డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్ ను కరీంనగర్ లో తేది 11. 11. 1976 న ప్రారంభించారు.
(8) శ్రీ పి. జగన్ మోహన్, ఐపిఎస్ , 1979 నుండి 1981 వరకూ. కార్గో బస్సులు, డిపో ఇన్సెంటివ్ స్కీమ్ ఏర్పాటు చేశారు.
(9) శ్రీ పి. ఎస్. రామ్మోహన రావు , ఐపిఎస్ , 1981 నుండి 1987 వరకూ . సుదీర్ఘకాలం పనిచేసి అనేక సంస్కరణలు చేసి , ఖర్చు నియంత్రణ లు చేసి సంస్థ ను గాడిన పెట్టిన మార్గదర్శకుడు . ఆర్.టి.సి ఈ నాటికీ బ్రతికి ఉంది అంటే వీరి అనేక చర్యలే కారణం అంటే అతిశయోక్తి కాదు . ఉత్తరాంధ్రలో బస్సుల జాతీయకరణ ప్రణాళిక అమలు జరిపారు. కర్నూలు బస్ స్టేషన్ ను 1985 లో ప్రారంభించారు.
(10) శ్రీ కె. విజయ రామారావు, ఐపిఎస్, 1986 నుండి 1989 వరకూ . కొత్త డిపోలు నిర్మాణం . కంప్యూటర్ వ్యవస్థ కి ఆద్యులు . హైదరాబాద్ లో 20 ఎకరాల విస్తీర్ణంలో , 12 కోట్ల అంచనా వ్యయం తో, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ కు , తేది 20 . 05. 1988 న ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావు గారిచే శంకుస్థాపన చేయించారు. గోల్డెన్ జూబ్లీ బస్ స్టేషన్ ను 1987 లో నాటి ముఖ్యమంత్రి గారిచే ప్రారంభించారు.
(11) శ్రీ హెచ్. జె . దొర , ఐపిఎస్ , 1989 నుండి 1992 వరకూ . ప్రజా సంబంధాలు పై ప్రత్యేక దృష్టి . పత్రికలు లో వచ్చే ప్రతీ విమర్శకు స్పందన, జవాబు తనం ఏర్పాటు చేశారు . అన్ని డిపో లకి కంప్యూటర్లు ఏర్పాట్లు చేయించారు. 28 ఎకరాల విస్తీర్ణంలో , తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం గా మొదట పిలువబడే , విజయవాడ పి.ఎన్.బి.ఎస్ ను తేది 23.09.1990 న ప్రారంభోత్సవం చేయించారు. గుంటూరు బస్ స్టేషన్ 1990 లో ఓపెన్ చేశారు.
(12) శ్రీ ఎ . హనుమంత రెడ్డి, ఐపిఎస్ , 1992 నుండి 1993 వరకూ.
(13) శ్రీ ఎ . ఆంజనేయ రెడ్డి , ఐ పి ఎస్.
1993 నుండి 1994 వరకూ. ఆధునిక రకరకాల హైటెక్ బస్సులు ప్రవేశపెట్టారు. అన్ని ముఖ్య విషయాలు తో ప్రస్థానం పత్రిక అభివృద్ధి చేశారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ను , ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి గారిచే తేది. 17. 08. 1994 న ప్రారంభోత్సవం చేయించారు.
(14) శ్రీ ఎస్. వి. ప్రసాద్ , ఐఎఎస్ , 1994 నుండి 1995 వరకూ . ప్రజల వద్దకు పాలన లో వచ్చిన సమస్యలు పరిష్కారం కొరకు చర్యలు తీసుకున్నారు.
(15) శ్రీ కె . సి. మిశ్రా , ఐఎఎస్ , 1995 నుండి 1996 వరకూ.
(16) శ్రీ వి. అప్పారావు, ఐపిఎస్ , 1996 నుండి 2000 వరకూ. క్రమ శిక్షణ , చిట్ పాస్ ల పై రెవెన్యూ లీకేజీ పై దృష్టి పెట్టారు. డ్రైవర్ టిమ్స్ ప్రవేశపెట్టారు.
(17) శ్రీ కె. ఆనందయ్య, ఐ పి ఎస్ 2000 లో 6 నెలలు మాత్రమే .

(18) శ్రీ ఆర్. పి. సింహ్ , ఐపిఎస్ , 2001 నుండి 2003 వరకూ. సిబ్బంది కి ఉత్తరాలు ద్వారా సంస్థ స్థితిగతులు తెలియజేయడం చేశారు. పుష్కరాలు సందర్భంగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు..
(19) శ్రీ ఎ. శివశంకర్, ఐపిఎస్, 2003 నుండి 2004 వరకూ. సంస్థలో సిబ్బంది నీ చైతన్యపరిచే విధంగా "మనుగడకు మార్పు " సామూహిక శిక్షణా కార్యక్రమం చేపట్టారు. తద్వారా సిబ్బంది లో సానుకూలమార్పు వచ్చింది , ప్రయాణికులు ఆదరణ తో ఆక్యుపెన్సి రేషియో పెరిగింది.
(20) శ్రీ పి. గౌతమ్ కుమార్ , ఐపిఎస్ , 2004 నుండి 2005 వరకూ. సిబ్బంది కి ఉత్తరాలు వ్రాయడం . బస్ భవన్ ప్రారంభించారు .
(21) శ్రీ ఎం. వి. కృష్ణారావు, ఐపిఎస్ , 2005 నుండి 2006 వరకూ . డిపో లు , నాన్ ఆపరేషనల్ యూనిట్స్ కు వెళ్ళినప్పుడు , అక్కడికక్కడే సిబ్బంది కి ప్రశంసా పత్రాలు , బహుమతులు , ప్రతిభా పురస్కారాలు అందజేశారు. "ప్రయాణికులే జీవనాధారం" కార్యక్రమం నిర్వహించారు.
(22) శ్రీ వి. దినేష్ రెడ్డి , ఐపిఎస్ , 2006 నుండి 2009 వరకూ. " మన చేతిలో భవిత " , " బంగారు భవిత " శిక్షణా కార్యక్రమం జరిపించారు. పల్లేవెలుగు బస్సులు ఆకుపచ్చ , తెలుపు రంగులు తో మార్పిడి చేసి , బస్సుల్లో బల్బులు స్థానం లో ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేశారు .
(23) శ్రీ ఎస్. ఎస్. పి. యాదవ్, ఐపిఎస్ , 2009 నుండి 2010 కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఎటువంటి చర్చలు , ఆందోళనలు లేకుండా సిబ్బంది కి మంచి జీత, భత్యాలు ఇచ్చారు.
(24) శ్రీ బి. ప్రసాదరావు , ఐపిఎస్ , 2010 నుండి 2012 వరకూ. సిబ్బంది కి శిక్షణా , సిబ్బంది శ్రేయస్సు కు సంక్షేమ పదకాలు , లక్షా 20 మందికి బి ఎస్ ఎన్ ఎల్ చే సియూజి సిమ్స్ ఇవ్వడం చేశారు. సిబ్బందికి "ఉజ్వల భవిత " " ఓ.ఆర్.పై ధ్యాస - సంస్థకు శ్వాశ " మోర్ ఫ్రం ది సేమ్ " కార్యక్రమం లు నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లు , కండక్టర్లకు టిమ్స్ ప్రారంభించారు.
(25) శ్రీ ఏ. కె. ఖాన్ , ఐపిఎస్ , 2012 నుండి 2013 వరకూ. " ముందడుగు " శిక్షణా కార్యక్రమం జరిపారు.
(26) డాక్టర్ జె . పూర్ణచంద్రరావు , ఐపిఎస్ , 2013 నుండి 2015 వరకూ . వీరి తండ్రి సంస్థ లో ఏలూరు డిపో లో అసిస్టెంట్ డిపో క్లర్క్ గా పనిచేశారు. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా మీటింగ్స్ నిర్వహించారు.
(27) శ్రీ ఎన్. సాంబశివరావు , ఐపిఎస్, 2015 నుండి 2016 వరకూ. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు తొలి ఎండి గా పనిచేశారు . కార్పొరేట్ ఆఫీసు నిర్మాణం , ప్రయాణికుల భద్రత , బస్ స్టేషన్ లు ఆదునీకరణ పనులు అమలుచేశారు. ఏ. ఎన్ . ఎల్ . కాంట్రాక్టు ను తొలగించి , సంస్థ లో కార్గో విభాగం ఏర్పాటుచేశారు. తేది 25. 05. 2016 న లైవ్ ట్రాకింగ్ యాప్, వై స్క్రీన్స్ , ఎన్. టి. ఆర్. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లను ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారి చే ప్రారంభించారు. తేది 03. 06. 2015 న సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హోదా లో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు చేశారు.
(28) డాక్టర్ ఎం. మాలకొండయ్య , ఐపిఎస్ , 2016 నుండి 2018 వరకూ . సిబ్బంది పై క్రమశిక్షణా చర్యలు పై ఒకే తరహా విధానం అమలుకు చర్యలు తీసుకున్నారు. అన్ని రకాల పొదుపు , వ్యయ నియంత్రణ చేపట్టారు.
(29) శ్రీ ఎన్. వి. సురేంద్ర బాబు , ఐపిఎస్ , 2018 నుండి 2019 వరకూ. చాలా కూల్ గా , అందరి తో నేరుగా మర్యాద గా మాట్లాడి , సంస్థ పురోభివద్ధికి కృషి చేశారు. వేలాది పాత కేసులు మూసివేశారు . క్రమం తప్పకుండా ఉదయం పూట ఉన్నత అధికారులు తో ఆడియో కాన్ఫరెన్స్ లు , ప్రతిరోజూ గ్రీవెన్స్ సమయం నిర్వహించి వారి కష్టాలు విని , అనుకూల చర్యలు తీసుకున్నారు . సంస్థ జీపులు , కార్లు తొలగించి , కాంట్రాక్టు విధానం లో వాహనాలు సమకూర్చట తో మిగులు డ్రైవర్లు ను బస్సు సర్వీసులకు ఉపయోగించుట తో కొంత మేర డ్రైవర్లు కొరత తీర్చారు. సిబ్బంది కి 1 / 2019 సర్క్యులర్ ద్వారా ఉద్యోగ భద్రత కల్పించారు. పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ పొందేవిధంగా చర్యలు పక్కాగా అమలుచేశారు. సిబ్బంది లో శ్రీ సురేంద్ర బాబు కు ముందు , ఆ తర్వాత శకం అనిపించుకొనేలా ప్రశంశలు పొందారు.
(30) శ్రీ ఎం. టి. కృష్ణబాబు , ఐఎఎస్ , 2019 లో చివరి 4 నెలలు వరకూ . వీరి నేతృత్వం లోనే సంస్థ , ప్రభుత్వం లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా విలీనం అమలు అయింది .
(31) శ్రీ మాదిరెడ్డి ప్రతాప్ , ఐపిఎస్ , 2020 లో 7 నెలలు కాలం . విలీనం తర్వాత మొదటి ఎండి . దినసరి వేతనం తో ఆన్ కాల్ డ్రైవర్లు విధానం తీసుకువచ్చారు. బస్సులు నడపడానికి డ్రైవర్ల కొరత కొంతమేర తీరింది.
(32) శ్రీ ఎం. టి. కృష్ణబాబు , ఐఎఎస్ , 2020 జూలై నుండి జనవరి 21 వరకూ 6 నెలలు .
(33) శ్రీ ఆర్.పి. ఠాగూర్ , ఐపిఎస్ , 2021 లో 5 నెలలు స్వల్ప కాలం.

(34) శ్రీ సి. హెచ్. ద్వారకా తిరుమల రావు , ఐపిఎస్ , గారు తేది 31. 05. 2021 నుండి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ శాఖ కమీషనర్ హోదా లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు. బోర్డ్ చైర్మన్ , వైస్ చైర్మన్ , డైరెక్టర్ పదవులు రాజకీయ నాయకులు నిర్వహిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు, యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ మిషన్లు , అద్దె విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం , కారుణ్య నియామకాలు , అరుణాచలం స్పెషల్ బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది.
ఆర్. టి. సి. వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు తీసుకున్నారంటే , అది వారు తర్వాత కాలం లో చీఫ్ సెక్రెటరీ లేదా డి.జి.పి లు గా నియమితులు అగుటకు ఒక అర్హత అనేటంతగా, చాలా మంది సి.ఎస్ లేదా డి..జి. పి. లుగా నియమితులు అయ్యారు . ఇలాంటి గొప్ప సంస్థలో పనిచెయ్యడం గర్వకారణం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి