పోస్ట్‌లు

ఆగస్టు, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

APSRTC ఉద్యోగులకు లామినేటెడ్ ID Cards

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ లామినేటెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అందువలన అందరు ఉద్యోగులు మీయొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్  మీ యూనిట్ ఆఫీసులలో 22.10.25 లోపు సబ్మిట్ చేయవలెనని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత ఆఫీస్ వారు ఆ ఫోటోలను 300 KB ఫైల్ సైజ్ ఉండేటట్లుగా Jpg file గా కన్వర్ట్ చేసి వాటిని కాంట్రాక్టర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

ఉద్యోగికి ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్లు

        ♦ ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.         ♦ ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.         ♦ APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించారు. *(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)*         ♦ నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.             *(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)*             *(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)*         ♦ DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.         ♦ ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మం...

నేనొక RTC కండక్టర్ ను

 నేనొక RTC కండక్టర్ ను  నేను కూడా కొద్దో గొప్పో చదివాను, కానీ ప్రతి ఉదయం లక్షల మందిని ఉన్నత విద్యకోసం వారి వారి విద్యాలయాలకు, ఉద్యోగాలకు సమయానికి పంపాలనే తాపత్రయం నాది... ఎందుకంటే  నేనొక RTC కండక్టర్ ను, ప్రతిరోజు వందలమందితో మాట్లాడి ఒక్కొక్కరిది ఒక్కో రకమైన మనస్తత్వం ఉన్నా,అందరిని సమన్వయం చేసుకొని వారి గమ్యస్థానాలకు చేర్చే ఓర్పు నేర్పు నాది... ఎందుకంటే  నేనొక RTC కండక్టర్ ను ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఒంట్లో సమస్యలు పట్టిపీడిస్తూ సత్తువ లేకుండ చేస్తున్నా, బిచ్చగాడు భుజానికి జోలె వేసుకొని అడుక్కున్నట్లుగా, క్యాష్ బ్యాగ్ వేసుకొని టికెట్ల రూపంలో ఒక్కొక్కరి దగ్గర అడుక్కొని తెచ్చి మొత్తం జమ చేసి ఆ డబ్బులన్నీ సంస్థలో కట్టి  ఈరోజుకు దినదిన గండంగా ఇలా డ్యూటీ అయిపోయిందబ్బా... హమ్మయ్యా...అనుకుంటాను ఎందుకంటే..... నేనొక RTC కండక్టర్ ను నా పిల్లల భవిష్యత్ కోసం పైసా పైసా పోగు చేస్తూ, నైట్ అవుట్ నరకంలా.. ఉన్నా...MGBS మూసి కాలువ పక్కన బస్సు ఆపి ఏదో ఒక సీటు పైనే.. పక్క వాల్చి, జాలిలేని దోమలు  నన్ను కుట్టి రక్తాన్ని పీలుస్తున్నా, నిద్రమత్తులోనే వాటిని దులుపుకుంటూ నిద్రలేని అహ...