పోస్ట్‌లు

సెప్టెంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

APSRTC ఉద్యోగులకు లామినేటెడ్ ID Cards

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ లామినేటెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అందువలన అందరు ఉద్యోగులు మీయొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్  మీ యూనిట్ ఆఫీసులలో 22.10.25 లోపు సబ్మిట్ చేయవలెనని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత ఆఫీస్ వారు ఆ ఫోటోలను 300 KB ఫైల్ సైజ్ ఉండేటట్లుగా Jpg file గా కన్వర్ట్ చేసి వాటిని కాంట్రాక్టర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

కండక్టర్లకు కీర్తి వందనం

🌷 మన దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అయితే, దేశ రక్షణకు సైనికులు వెన్నుముక లాంటివారు. వారి త్యాగం ఎంత వెలకట్టలేనిదో అందరికీ తెలిసిందే. అయితే, మనం ప్రతీ రోజు ఆధారపడే రవాణా రంగం ఉద్యోగులూ అంతే వెలకట్టలేని సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కండక్టర్లు — వీరు మన ప్రయాణంలో తోడుగా నిలిచి, మనల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చే కనిపించని యోధులు. 👉 129 డిపోలలో 11,162 బస్సులు ప్రతీ రోజు 39 లక్షల కిలోమీటర్లు పరిగెత్తుతూ 14.75 కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న ఈ మహా సంస్థలో 44,749 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 16,366 మంది మగ మరియూ మహిళా కండక్టర్లు అర్ధరాత్రి , అపరాత్రి , పండగలు, పబ్బాలు అనే తేడా లేకుండా తమ జీవితాన్ని ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం అర్పించారు. 👉 రోజుకు 8 గంటలపాటు కదులుతున్న బస్సులో నిలబడి, వందలాది ప్రయాణికులను కలుస్తూ, ప్రతీ ఒక్కరికి చిరునవ్వుతో టికెట్ ఇచ్చి, మార్గదర్శకుడు గా , ఆర్థిక లావాదేవీలు సజావుగా నిర్వహించడం చిన్న విషయం కాదు. అనేక రూట్లలో సరైన రక్షణ , మరుగుదొడ్ల సౌకర్యాలు కూడా లేని ప్రాంతాల్లో  విధులు నిర్వహించే "మహిళా కండక్టర్లు " సేవలు ఇంకా వెలకట్టలేని...