Intoxication కేసు ల గురించి

Intoxication కేసు ల గురించి

(ఉద్యోగ భద్రత సమాచారం) 

 👉Cir. No.PD-11/2020,Dt.18.06.2020 ప్రకారం:-

👉 *1.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 10%mg కాని 10%mg కంటే తక్కువ నమోదు అయినప్పుడు*
 
👉a.క్షమాపణ పత్రం(Apology Letter)వ్రాసి ఇవ్వాలి. 
👉b.ఒకవేళ క్షమాపణ పత్రం వ్రాసి ఇవ్వని పక్షంలో చార్జిషీట్ ఇచ్చి సెన్ స్యూర్ (Censure) ఇస్తారు. 

👉 *2.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 10%mg కంటే ఎక్కువ 30%mg వరకు నమోదు అయినప్పుడు:*

👉a.సెక్యూరిటీ (SASI/RHC) రిపోర్ట్ ద్వారా యూనిట్ ఆఫీసర్ (డిపో మేనేజరు) కు ఫర్ ధర్ యాక్షన్ నిమిత్తం పంపిస్తారు.
👉ఆ రిపోర్ట్ లో డ్రైవర్ పేరు, స్టాఫ్ నెంబర్, డ్యూటీ వివరములు, బస్ నెంబర్,డేట్ ,రీడింగ్ తీసుకున్న సమయాలు, రీడింగ్ సీరియల్ నెంబర్, రీడింగ్ పర్సెంట్ లు, ఎవరి సమక్షంలో రీడింగ్ తీసారో వారి సంతకం, రీడింగ్ తీసుకున్న Rtc కానిస్టేబుల్ గారి సంతకం,బస్ out going late,మార్చిన స్టాప్(Cond/Dri) పేరు, స్టాఫ్ నెంబర్, పట్టుబడిన వారియొక్క గత చరిత్ర, etc,ఉంటాయి. 
👉ఆ రిపోర్ట్ తో పాటు గా పట్టుబడిన  ఉద్యోగి స్పాట్ సంజాయిషీ, సాక్షి సంతకము తో లెటర్ రిపోర్ట్ కు జతపరిచి యూనిట్ ఆఫీసర్ కు పంపిస్తారు. 
👉యూనిట్ ఆఫీసర్ చార్జిషీట్ ఇష్యూ  చేస్తారు. చార్చిషీట్ తీసుకున్న రోజు నుండి   7 రోజులలో సంజాయిషీ ఇవ్వాలి. 

👉a.10%mg కంటే ఎక్కువ 30%mg వరకు   పట్టు బడినట్లయితే ఆ ఉద్యోగికి వార్షిక  ఇంక్రిమెంటు ONE(01)YEAR  W.O.C విత్  అవుట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ తో  పనిష్మేంట్ ఇస్తారు.
 👉ఇదే రీడింగ్ ల మధ్య లో  2 వ సారి పట్టుబడినట్లయితే వార్షిక  ఇంక్రిమెంట్ TWO(02)YEARS W.O.C. విత్ అవుట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ తో పనిష్మేంట్ ఇస్తారు. 
👉ఇదే రీడింగ్ ల మధ్య లో 3వ సారి దొరికితే మేజర్- 2 గా పరిణనించి, చార్చిషీట్, ఎంక్వయిరీ, కామెంట్సు, Show Cause Notice ఇచ్చి వార్షిక ఇంక్రిమెంటు  Two(02)YEARS,W.C విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ పనిష్మేంట్ ఇస్తారు. 

👉 *3.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 30%mg కన్నా ఎక్కువ  నమోదు అయినప్పుడు:*
 కేసును Major-2  గా పరిగణించి  పై ప్రొసీజర్ ప్రకారం కేసు ను ప్రోసెస్ చేసి వార్షిక ఇంక్రిమెంటు ను TWO(02)YEARS ,W.C విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ తో పనిష్మేంట్ ఇస్తారు. 
👉b.రీడింగ్ 30% కంటే ఎక్కువ తో రెండవసారి పట్టుబడినట్లయితే కేసు ను పై ప్రొసీజర్ ప్రకారం ప్రోసెస్ చేసి క్రింది స్థాయి కేడర్ కు Reversion చేస్తారు. 
👉b.ఒకవేళ Reversion కు వీలుపడని పక్షంలో వార్షిక  ఇంక్రిమెంట్ ను TWO(02) YEARS ,W.C విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ తో పనిష్మేంట్ ఇస్తారు. 
👉c. రీడింగ్ 30%mg కంటే ఎక్కువ 3 వ సారి నమోదు అయినప్పుడు:సస్పెండ్ చేసి కేసు ప్రొసీజర్ ప్రకారం  ప్రోసెస్ చేసి " రిమూవల్ " చేస్తారు. 

👉డ్యూటీ లో ఉండగా బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 30%mg కంటే ఎక్కువ నమోదు అయినప్పుడు సస్పెండ్ చేసి కేసు ప్రొసీజర్  ప్రకారం ప్రోసెస్ చేసి "రిమూవల్ " చేస్తారు.

 👉గమనిక:-ప్రతి కేసు యొక్క ఫైనల్ ఆర్డర్ ను "P" నందు పొందుపరచి సర్వీస్ రికార్డు నందు రెడ్ ఇంక్ తో రికార్డు చేస్తారు. కావున ఉద్యోగ సోదరులు పైన విషయాలు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మీ మీ ఉద్యోగాలను సక్రమంగా చేసుకోవాలని మనవి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

Maternity leaves