పోస్ట్‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణానికి స్త్రీ శక్తి స్కీమ్

చిత్రం
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణానికి  స్త్రీ శక్తి స్కీమ్ ఇచ్చిన జీవో.  జీవో నెంబర్.27 తేదీ. 11/8/25.  తెలుగుదేశం ప్రభుత్వం తన ఎన్నికల హామీలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని మహిళల ఉచిత ప్రయాణానికి ఈ జీవోను ఇచ్చినది.  దీని గైడ్లైన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1) ఈ పథకం 15/8/25 తేది నుంచి అమల్లోకి వస్తుంది. 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాలికలు, స్త్రీలు, మరియు ట్రాన్స్ జెండర్ లకు తగిన ఐడెంటిటీ ప్రూఫ్ తో ఈ పథకం ఐదు రకాల బస్సులలో అమలు అవుతున్నది. 3) ఐదు రకాల బస్సులు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఉచితంగా ప్రయాణించవచ్చును. 4) ఈ స్కీము సప్తగిరి ఎక్స్ ప్రెస్ లు,అల్ట్రా డీలక్స్ లు, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్లు మరియు అన్ని రకాల ఏసీ బస్సులు,నాన్ స్టాప్ సర్వీసులు,అంతర్రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్  క్యారేజ్ సర్వీసులు,చార్టెడ్ సర్వీసులు మరియు ప్యాకేజ్ టూర్ బస్సులకు వర్తించదు. 5) ప్రస్తుతం ఉన్న బస్సులలోనే ఈ స్కీము అమలవుతున్నది. స్కీం అమలైన తర్వాత పరిస్థితిని బట్టి,  ప్రయాణికుల సంఖ్యను బట్టి రా...

నేనొక RTC కండక్టర్ ను

 నేనొక RTC కండక్టర్ ను  నేను కూడా కొద్దో గొప్పో చదివాను, కానీ ప్రతి ఉదయం లక్షల మందిని ఉన్నత విద్యకోసం వారి వారి విద్యాలయాలకు, ఉద్యోగాలకు సమయానికి పంపాలనే తాపత్రయం నాది... ఎందుకంటే  నేనొక RTC కండక్టర్ ను, ప్రతిరోజు వందలమందితో మాట్లాడి ఒక్కొక్కరిది ఒక్కో రకమైన మనస్తత్వం ఉన్నా,అందరిని సమన్వయం చేసుకొని వారి గమ్యస్థానాలకు చేర్చే ఓర్పు నేర్పు నాది... ఎందుకంటే  నేనొక RTC కండక్టర్ ను ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఒంట్లో సమస్యలు పట్టిపీడిస్తూ సత్తువ లేకుండ చేస్తున్నా, బిచ్చగాడు భుజానికి జోలె వేసుకొని అడుక్కున్నట్లుగా, క్యాష్ బ్యాగ్ వేసుకొని టికెట్ల రూపంలో ఒక్కొక్కరి దగ్గర అడుక్కొని తెచ్చి మొత్తం జమ చేసి ఆ డబ్బులన్నీ సంస్థలో కట్టి  ఈరోజుకు దినదిన గండంగా ఇలా డ్యూటీ అయిపోయిందబ్బా... హమ్మయ్యా...అనుకుంటాను ఎందుకంటే..... నేనొక RTC కండక్టర్ ను నా పిల్లల భవిష్యత్ కోసం పైసా పైసా పోగు చేస్తూ, నైట్ అవుట్ నరకంలా.. ఉన్నా...MGBS మూసి కాలువ పక్కన బస్సు ఆపి ఏదో ఒక సీటు పైనే.. పక్క వాల్చి, జాలిలేని దోమలు  నన్ను కుట్టి రక్తాన్ని పీలుస్తున్నా, నిద్రమత్తులోనే వాటిని దులుపుకుంటూ నిద్రలేని అహ...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - రథసారధులు - వివరాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - రథసారధులు - వివరాలు ***" ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో 6 వ నిజాం నవాబు కాలంలో 1899 సంవత్సరం లో "నిజాం స్టేట్ రైల్వేస్ NSR "  ఆధ్వర్యంలో కాచిగూడ నుండి మన్మడ్ కి మీటర్ గేజ్ లో రైలు నడిపేది. తదనంతరం తేది 29.08. 1911 నుండి 1948 వరకూ ,  7 వ నిజాం గా పరిపాలన చేసిన  "  మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ "  కు  తన తల్లి ' జహారున్నీషా బేగం' ,  తాను నాణేలు సేకరణ అలవాటు లో భాగం గా దాచుకున్న లక్ష వెండి నాణేలు  వితరణ చేసి ప్రజలకు రైల్వే తో పాటు బస్సు రవాణా కూడ అందుబాటులోకి  తీసుకురావాలని అభిలాష ను కుమారునకు తెలియచేసారు . తల్లి కోరిక మేరకు  ఆ సొమ్ముతో  7వ నిజాం ,  గ్రేట్ బ్రిటన్ నుండి ఓడలు ద్వారా 25 సీట్లు గల 27 అల్బేయన్ పెట్రోల్  బస్సులను ప్రత్యేకంగా తెప్పించారు. 166 మంది సిబ్బంది తో వీటిని నడిపించారు. *** రైల్వే రవాణా లేని ప్రాంతాలలో మొదట నడపాలి అని నిర్ణయం తీసుకున్నారు. లండన్ నుండి తెచ్చిన బస్సులలో కొన్నింటికి ఆకుపచ్చ, కొన్నింటికి ఎరుపురంగు లు వేయించి ఆకుపచ్చని రంగు బస్సులు సిటీ బస్సులు గా, ఎరుపు రంగు బస్సు...

ఉద్యోగుల ఎపిజిఎల్ఐ (APGLI) సమాచారం

 మీరు ఎపిజిఎల్ఐ సభ్యులా..అయితే...ఈ విషయాన్ని జాగ్రత్త గా చదవండి...                    మీరు ఈ క్రింద పేర్కోనబడిన వేతన స్లాబ్ లో వున్నట్టయితే..మీరు ఆ స్లాబ్ కు ఎదురుగా వున్న నెలసరి ప్రీమియమ్ మీకు ప్రతి నెల రికవరీ చేయించుకోవాలి-ఇది పూర్తిగా ఉద్యోగి భాద్యత.            స్లాబ్ వివరాలు                   రికవరీ కావలసిన ప్రీమియం  రూ.20000.00 నుండి రూ.25220.00 వరకు రూ.800.00 నెలకు  రూ.25221.00 నుండి రూ32670.00 వరకు రూ.1000.00 నెలకు  రూ.32671.00 నుండి రూ.44570.00 వరకు రూ.1300.00 నెలకు  రూ.44571.00 నుండి రూ.54060.00 వరకు రూ.1800.00 నెలకు   రూ.54061.00 నుండి రూ.76730.00 వరకు రూ.2200.00 నెలకు  రూ.73761.0 పైన ఎంతైనా         రూ.3000.00 నెలకు                     పైన కనబరచిన స్లాబ్ లో మీ ఇంక్రిమెంట్ చూచుకోండి... మీకు వచ్చే ఇంక్రిమెంట్ కు ఎదురుగా వున్...

ఉద్యోగులకు విత్ క్యుములేటివ్ పనిష్మెంట్ల గురించి ఉపయోగకరమైన సమాచారము

 ఉద్యోగులకు ఉపయోగకరమైన సమాచారము                ఏపిఎస్ ఆర్టీసీ లో వున్నప్పుడు విత్  క్యుములేటివ్ పనిష్మెంట్ల  (With Cumulative,Pay reducation & Afresh Appointments) Relief  కై లేబర్ కోర్టులకు ఆశ్రయించేవారము. కాని ప్రభుత్వం లోకి విలీనం అయిన తదుపరి ఆ సౌకర్యము రద్దు కాబడి, హైకోర్టులో అందరి ఉద్యోగుల మాదిరిగా మనము కూడ సర్వీసు మ్యాటర్స్ లో కోర్టులో వ్యాజ్యము వేయాలి. Relief పొందాలి.  అందుకుగాను ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా వుండాలి.  Charge Memo,Charge sheet & Suspension order Explanation to the Charge sheet Copy Enquiry Report copy  Show cause notice copy Explanation to SCN  copy  Final order copy 1st Appeal represented copy.  1st Appeal rejected proceedings copy 2nd Review petition represented copy. 2nd Review petition rejected proceedings.         పై కాపిలను తప్పనిసరిగా పనిష్మెంట్ పొందిన ఉద్యోగులు వుంచుకుని, విజయవాడ హైకోర్టులో వ్యాజ్యం వేసి, రిలీఫ్ పొందవచ్చును. ఇంక...

10 D ఫారము గురించి

 మిత్రులారా! 10D ఫారము గురించి తెలుసుకుందాము.  👉1.ఉద్యోగి పెన్షన్ పొందడానికి ఇవ్వవలసిన ఫారము ను 10D ఫారము అంటారు.  👉2.నెలవారీ పెన్షన్ పొందడానికి ఉద్యోగి సమర్పించవలసిన ఫారమునే 10D ఫారము అంటారు.  👉3.EPFO సభ్యులైన వారందరికీ  నెలవారి పెన్షన్ మంజూరు చేస్తారు. దీనిలో 2,3 రకాలు ఉన్నాయి.  👉4.ఉద్యోగి పెన్షన్ పొందాలంటే కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. మరియు 58 సంవత్సరాలు వచ్చి ఉండాలి.  👉5.ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించి నట్లయితే ఆ ఉద్యోగి యొక్క నామినికి వితంతువు పెన్షన్ ను అలాగే ఉద్యోగి అంకవైకల్యము పొందినట్లయితే అంకవైకల్య పెన్షన్ ను పొందుతారు. కొన్ని సందర్భాల్లో 58 సంవత్స రాలకు పొందవలసిన పెన్షన్ ను 50 సంవత్సరాలకే పొందవచ్చు. దీనిని Reduced పెన్షన్ అంటారు. దీనికి వచ్చే వాస్తవ పెన్షన్ కన్నా తక్కువ వస్తుంది.  👉 6.EPFO నుండి పెన్షన్ పొందాలంటే ఆ ఉద్యోగి కాని లేక ఆ ఉద్యోగికి సంబంధించిన వారు కాని తప్ప కుండా  ఒక దరఖాస్తు ను EPFO కు ఆన్ లైన్ గాని ఆఫ్ లైన్ లో గాని సమర్పించాలి.  👉7.మన APSRTC మినహయింపు పొందిన సంస్థ కాబట్టి మన ఉద్యోగులు ఆఫ్ లైన్ లోనే...

Student Buspass Online Registration Process

  స్టూడెంట్ ఆన్లైన్ లో బస్ పాస్ రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం   👉    Click Here

నేను RTC డ్రైవర్

*నేను RTC డ్రైవర్ ను*  నేను పెద్దగా చదువుకోలేదు, కానీ ప్రతి ఉదయం కొన్ని వేల మందిని ఉన్నత విద్య కోసం వారి విద్యాలయాలకు సమయానికి పంపాలనే తాపత్రయం నాది... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను*, ప్రతిరోజు వందల కిలోమీటర్లు బస్సు నడిపి బక్క చిక్కిన ఎముకల గూడు నాది, అయినా సరే ఒంటి చేత్తో వంద మంది ఎక్కిన బస్సును గమ్యం చేర్చే నేర్పు నాది... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ని* ఇంట్లో సమస్యలు ఇబ్బంది పెడుతున్న, ఒంట్లో సమస్యలు నన్ను ఓపిక లేకుండా చేస్తున్న, నా డ్రైవింగ్ సీట్ ఎక్కగానే 16 ఏండ్ల పడుచు కుర్రోడిని అయిపోత, ఎందుకంటే..... *నేను RTC డ్రైవర్ ను* నా పిల్లల భవిష్యత్ కోసం పైసా పైసా పోగెస్తా, నైట్ అవుట్ నరకంలాగ ఉన్నా...  MGBS లొ జాలిలేని దోమలు నా ఒంటిని  జాలి చేస్తున్న రాత్రంతా వాటితో సహవాసం చేస్త... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను* లోకమంత దసరా, దీపావళి ఆనందంగా జరుపుకుంటున్నారు, కానీ పండగ పూట ఇంట్లో నాన్న లేడు ఎందుకమ్మా ? అని అడిగే నా చిన్నారి తల్లికి తెలియదు, వాళ్ళ నాన్న పండగ పూట బస్సు నడపకుంటే వందల కుటుంబాలకు పండగ ఉండదని,, ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను* ఎండాకాలం వేడి ఎం...

Intoxication కేసు ల గురించి

Intoxication కేసు ల గురించి (ఉద్యోగ భద్రత సమాచారం)   👉Cir. No.PD-11/2020,Dt.18.06.2020 ప్రకారం:- 👉 *1.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 10%mg కాని 10%mg కంటే తక్కువ నమోదు అయినప్పుడు*   👉a.క్షమాపణ పత్రం(Apology Letter)వ్రాసి ఇవ్వాలి.  👉b.ఒకవేళ క్షమాపణ పత్రం వ్రాసి ఇవ్వని పక్షంలో చార్జిషీట్ ఇచ్చి సెన్ స్యూర్ (Censure) ఇస్తారు.  👉 *2.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 10%mg కంటే ఎక్కువ 30%mg వరకు నమోదు అయినప్పుడు:* 👉a.సెక్యూరిటీ (SASI/RHC) రిపోర్ట్ ద్వారా యూనిట్ ఆఫీసర్ (డిపో మేనేజరు) కు ఫర్ ధర్ యాక్షన్ నిమిత్తం పంపిస్తారు. 👉ఆ రిపోర్ట్ లో డ్రైవర్ పేరు, స్టాఫ్ నెంబర్, డ్యూటీ వివరములు, బస్ నెంబర్,డేట్ ,రీడింగ్ తీసుకున్న సమయాలు, రీడింగ్ సీరియల్ నెంబర్, రీడింగ్ పర్సెంట్ లు, ఎవరి సమక్షంలో రీడింగ్ తీసారో వారి సంతకం, రీడింగ్ తీసుకున్న Rtc కానిస్టేబుల్ గారి సంతకం,బస్ out going late,మార్చిన స్టాప్(Cond/Dri) పేరు, స్టాఫ్ నెంబర్, పట్టుబడిన వారియొక్క గత చరిత్ర, etc,ఉంటాయి.  👉ఆ రిపోర్ట్ తో పాటు గా పట్టుబడిన  ఉద్యోగి స్పాట్ సంజాయిషీ, సాక్షి సంతకము తో లెటర్ రిపోర్ట్ కు జతపరిచి యూనిట్ ఆ...

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

*ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం* ఏపీ ఉద్యోగుల బదిలీపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల బదిలీల్లో అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. మరో ఏడు రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలివే.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయిన ఏపీ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేయనుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్‌మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ఏపీ ప్రభుత్వం ప్రాధా...

APSRTC సిబ్బంది నిజాయితీ

చిత్రం

ఒంగోలు నుండి బెంగళూరుకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు

బెంగళూరుకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఒంగోలు టౌన్: ప్రయాణికుల సౌకర్యార్థం ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి బెంగళూరుకు సూపర్ లగ్జరీ సర్వీసును ఆదివారం ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ డి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు ఒంగోలు నుంచి బయలుదేరి కందుకూరు, పామూరు, ఉదయగిరి, బద్వేలు, కడప, మదనపల్లి మీదుగా బెంగళూరు చేరుకుంటుందని తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు ఒంగోలులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు. అలాగే, బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు ఒంగోలు చేరుకుంటుందని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Latest News

చిత్రం
ఉద్యోగుల సమస్యలపై AP ప్రభుత్వం 30.05.25 న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ,ఉద్యోగ సంఘాలకు చర్చలకు ఆహ్వానించింది.

ఉద్యోగ భద్రతపైన సామాన్య ఉద్యోగ సందేహాలు...నివృత్తి

*ఉద్యోగ భద్రతపైన సామాన్య ఉద్యోగ సందేహాలు...నివృత్తి*  *సందేహము:- జి.వో నెంబరు: 70,71 మేరకు ఎవరైన కండక్టరు తన వృత్తిలో ప్రయాణికుడి వద్దనుండి టిక్కెట్టుకు డబ్బులు తీసుకుని పొరపాటున ఇవ్వకపోతే… సస్పెండు చేస్తారా? తెలియజేయగలరు*   నివృత్తి:- జి.వో నెంబరు: 70,71 మేరకు అందులో పేర్కోన్న నేరారోపణ మేరకు ఐటం నెంబరు కనబరస్తూ… చార్జిషీటు ఇస్తారు. సస్పెండు చేయరు (1/19 మేరకు), తదుపరి ఆ చార్జిషీటుకు సంజాయిషి ఇచ్చిన పిదప   సర్క్యులర్ 1/19 మేరకు 1 సం..ము w/c/e Punishmment ఇస్తారు. గత రెండు సం..ములుగా ఇలాంటి కేసులలో కండక్టర్లు సస్పెండు,రిమూవల్ కాబడివున్నారు. (ఉదా: కదిరి డిపోలో 3 గ్గురు సస్పెండు గురికాబడినారు) . నిన్న ఎన్.ఎం.యు.ఎ నాయకుల మీటింగ్ మేరకు హెడ్ ఆఫీసు ఇచ్చిన సర్క్యులర్ మేరకు కేవలం జి.వో నెంబరు: 70,71 మేరకు చార్జిషీటు ఇస్తారు (సెక్షన్ లను పేర్కోంటు), అంతియే కాని యాక్షన్ మాత్రము సర్క్యులర్ 1/2019 లో పేర్కోనబడినట్తుగా నే చేయురు

Senior citizens: కేంద్రం నుంచి స్పెషల్ ఆఫర్లు… ఒక్క అర్హత చాలు

Senior citizens: కేంద్రం నుంచి స్పెషల్ ఆఫర్లు… ఒక్క అర్హత చాలు… పదవీ విరమణ తర్వాత జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఎంతో ముఖ్యం. భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు అనేక ఆర్థిక ప్రయోజనాలు అందించడమే కాకుండా, వారిని ఆర్థికంగా స్వతంత్రంగా జీవించడానికి పెద్ద అవకాశాలు కల్పిస్తోంది. ఈ ప్రయోజనాలు సీనియర్ సిటిజన్లకు ఒక అద్భుతమైన ఆదాయ మార్గాన్ని అందిస్తాయి. రిటైర్ అయిన తర్వాత కూడా మీరు గౌరవంగా, ఆర్థికంగా భద్రంగా జీవించడానికి ఈ పథకాలు ఎంతో ఉపయోగకరమైనవి. ఇక, ఈ ఆర్థిక ప్రయోజనాలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్లకు అందించే ముఖ్యమైన ప్రయోజనాలు పదవీ విరమణ తర్వాత చాలా మందికి ఆదాయం ఆగిపోతుంది. అయితే, ఆరోగ్య ఖర్చులు, రోజు రోజుకి అవసరాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో, ప్రభుత్వ సాయం వలన సీనియర్ సిటిజన్లకు కొంత ఆదాయాన్ని పొందడం సులభమవుతుంది. ఈ సందర్భంగా, ప్రభుత్వ విభాగాలు, ఆర్థిక సంస్థలు, మరియు బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ ...

ఆటోనగర్ లో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్

ఆటోనగర్ లో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ RTC ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆటోనగర్ డిపోను ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్గా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. గతంలో తయారు చేసిన DPRలో అవసరమైన మార్పులు చేయిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో జి+2 భవనంగా నిర్మించబోయే ఈ ప్రాజెక్టులో మాల్స్, థియేటర్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు.

పుష్కరాలకు మనమూ వెళ్దామా

చిత్రం

OT CALCULATION DETAILS

 అందరికీ 🙏..... 🌹🌹🌹🌹 తెలియని వారు తెలుసుకొనుటకై 🌹🌹 Today OT లెక్కించే ఫార్ములా...గురుంచి తెలుసుకుందాం 👉ఫార్ములా.... [{ (Basic +DA)×12 }÷ 365×8]×2 అప్లై చేసేటప్పుడు  Basic +DA కూడుకోండి  తరువాత కూడుకున్న దాన్ని 12 తో గుణించండి మరియు 365×8 గుణిస్తే 2920 వస్తుంది.   ( ఇప్పుడు  బేసిక్ +da ను 12 తో గుణించగా వచ్చిన విలువను, మరియు 365×8 గుణించగా వచ్చిన విలవతో భాగించగా... ఒక మొత్తం వస్తుంది, దాన్ని 2 తో గుణిస్తే, గంటకు ఎంత అనేది ఖచ్చితమైన OT అంమౌంట్ చూపిస్తుంది)  👉 ఉదాహరణకు:-  ఇక్కడ ఒక ఉద్యోగి basic +Da ను తీసుకుని లెక్కించే ప్రయత్నం చేద్దాము   ఉద్యోగి basic= 27500  DA                 =   9259 ఇప్పుడు రెండు కూడితే Total              =36759 వచ్చిన మొత్తాన్ని 12 తో గుణిస్తే 36759×12 = 441108 మరియు ఫార్ములా లో 365×8=2920             👉    ఇప్పుడు ఫార్ములా లో  వీటిని అప్లై చేస్తే    [ {(Basic+DA)×1...

రావుల పాలెం నుండి సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

చిత్రం

సరస్వతి ధామం పుష్కర యాత్రకు కొవ్వూరు నుండి బస్సులు

సరస్వతి ధామం పుష్కర యాత్రకు కొవ్వూరు నుండి బస్సులు  కొవ్వూరు డిపో నుండి ప్రప్రధమంగా సరస్వతి ధామం పుష్కర యాత్రకు స్పెషల్ బస్సు 14.05,2025 సాయంత్రం 04.00 గంటలకు (సూపర్ లగ్జరీ) బయలుదేరి భాసర జ్ఞాన సరస్వతి దేవి, దక్షిణ త్రివేణి సంగమం (గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతీ నదులు) లో పుణ్య స్నానం ధర్మపురి %% శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కాళేశ్వరం మహా కాళేశ్వరుడు సరస్వతి పుష్కర స్నానం కొండగట్టు ఆంజనేయ స్వామి వేములవాడ రాజ రాజేశ్వర స్వామి వరంగల్ %% భద్రకాళీ మాత రామప్ప రామప్ప దేవాలయ దర్శనం అనంతరం 17.05.2025 న ఉదయం కొవ్వూరు చేరునని డిపో మేనేజర్ వైవివి. ఎన్ కుమార్ తెలిపారు. కొవ్వూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు విశేషంగా ఆధరిస్తున్నందున మరియు సరస్వతి పుష్కరాలకు విశేష స్పందన కారణం గా ది 19.05.2025 న సాయంత్రం 04.00 గంటలకు ఇంద్ర (ఎ సి ) బస్సు బయలుదేరునని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డిపోలో సంప్రదించాలని, యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ తెలియజేశారు