పోస్ట్‌లు

జూన్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

APSRTC ఉద్యోగులకు లామినేటెడ్ ID Cards

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ లామినేటెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అందువలన అందరు ఉద్యోగులు మీయొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్  మీ యూనిట్ ఆఫీసులలో 22.10.25 లోపు సబ్మిట్ చేయవలెనని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత ఆఫీస్ వారు ఆ ఫోటోలను 300 KB ఫైల్ సైజ్ ఉండేటట్లుగా Jpg file గా కన్వర్ట్ చేసి వాటిని కాంట్రాక్టర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

10 D ఫారము గురించి

 మిత్రులారా! 10D ఫారము గురించి తెలుసుకుందాము.  👉1.ఉద్యోగి పెన్షన్ పొందడానికి ఇవ్వవలసిన ఫారము ను 10D ఫారము అంటారు.  👉2.నెలవారీ పెన్షన్ పొందడానికి ఉద్యోగి సమర్పించవలసిన ఫారమునే 10D ఫారము అంటారు.  👉3.EPFO సభ్యులైన వారందరికీ  నెలవారి పెన్షన్ మంజూరు చేస్తారు. దీనిలో 2,3 రకాలు ఉన్నాయి.  👉4.ఉద్యోగి పెన్షన్ పొందాలంటే కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. మరియు 58 సంవత్సరాలు వచ్చి ఉండాలి.  👉5.ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించి నట్లయితే ఆ ఉద్యోగి యొక్క నామినికి వితంతువు పెన్షన్ ను అలాగే ఉద్యోగి అంకవైకల్యము పొందినట్లయితే అంకవైకల్య పెన్షన్ ను పొందుతారు. కొన్ని సందర్భాల్లో 58 సంవత్స రాలకు పొందవలసిన పెన్షన్ ను 50 సంవత్సరాలకే పొందవచ్చు. దీనిని Reduced పెన్షన్ అంటారు. దీనికి వచ్చే వాస్తవ పెన్షన్ కన్నా తక్కువ వస్తుంది.  👉 6.EPFO నుండి పెన్షన్ పొందాలంటే ఆ ఉద్యోగి కాని లేక ఆ ఉద్యోగికి సంబంధించిన వారు కాని తప్ప కుండా  ఒక దరఖాస్తు ను EPFO కు ఆన్ లైన్ గాని ఆఫ్ లైన్ లో గాని సమర్పించాలి.  👉7.మన APSRTC మినహయింపు పొందిన సంస్థ కాబట్టి మన ఉద్యోగులు ఆఫ్ లైన్ లోనే...

Student Buspass Online Registration Process

  స్టూడెంట్ ఆన్లైన్ లో బస్ పాస్ రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం   👉    Click Here

నేను RTC డ్రైవర్

*నేను RTC డ్రైవర్ ను*  నేను పెద్దగా చదువుకోలేదు, కానీ ప్రతి ఉదయం కొన్ని వేల మందిని ఉన్నత విద్య కోసం వారి విద్యాలయాలకు సమయానికి పంపాలనే తాపత్రయం నాది... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను*, ప్రతిరోజు వందల కిలోమీటర్లు బస్సు నడిపి బక్క చిక్కిన ఎముకల గూడు నాది, అయినా సరే ఒంటి చేత్తో వంద మంది ఎక్కిన బస్సును గమ్యం చేర్చే నేర్పు నాది... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ని* ఇంట్లో సమస్యలు ఇబ్బంది పెడుతున్న, ఒంట్లో సమస్యలు నన్ను ఓపిక లేకుండా చేస్తున్న, నా డ్రైవింగ్ సీట్ ఎక్కగానే 16 ఏండ్ల పడుచు కుర్రోడిని అయిపోత, ఎందుకంటే..... *నేను RTC డ్రైవర్ ను* నా పిల్లల భవిష్యత్ కోసం పైసా పైసా పోగెస్తా, నైట్ అవుట్ నరకంలాగ ఉన్నా...  MGBS లొ జాలిలేని దోమలు నా ఒంటిని  జాలి చేస్తున్న రాత్రంతా వాటితో సహవాసం చేస్త... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను* లోకమంత దసరా, దీపావళి ఆనందంగా జరుపుకుంటున్నారు, కానీ పండగ పూట ఇంట్లో నాన్న లేడు ఎందుకమ్మా ? అని అడిగే నా చిన్నారి తల్లికి తెలియదు, వాళ్ళ నాన్న పండగ పూట బస్సు నడపకుంటే వందల కుటుంబాలకు పండగ ఉండదని,, ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను* ఎండాకాలం వేడి ఎం...

Intoxication కేసు ల గురించి

Intoxication కేసు ల గురించి (ఉద్యోగ భద్రత సమాచారం)   👉Cir. No.PD-11/2020,Dt.18.06.2020 ప్రకారం:- 👉 *1.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 10%mg కాని 10%mg కంటే తక్కువ నమోదు అయినప్పుడు*   👉a.క్షమాపణ పత్రం(Apology Letter)వ్రాసి ఇవ్వాలి.  👉b.ఒకవేళ క్షమాపణ పత్రం వ్రాసి ఇవ్వని పక్షంలో చార్జిషీట్ ఇచ్చి సెన్ స్యూర్ (Censure) ఇస్తారు.  👉 *2.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 10%mg కంటే ఎక్కువ 30%mg వరకు నమోదు అయినప్పుడు:* 👉a.సెక్యూరిటీ (SASI/RHC) రిపోర్ట్ ద్వారా యూనిట్ ఆఫీసర్ (డిపో మేనేజరు) కు ఫర్ ధర్ యాక్షన్ నిమిత్తం పంపిస్తారు. 👉ఆ రిపోర్ట్ లో డ్రైవర్ పేరు, స్టాఫ్ నెంబర్, డ్యూటీ వివరములు, బస్ నెంబర్,డేట్ ,రీడింగ్ తీసుకున్న సమయాలు, రీడింగ్ సీరియల్ నెంబర్, రీడింగ్ పర్సెంట్ లు, ఎవరి సమక్షంలో రీడింగ్ తీసారో వారి సంతకం, రీడింగ్ తీసుకున్న Rtc కానిస్టేబుల్ గారి సంతకం,బస్ out going late,మార్చిన స్టాప్(Cond/Dri) పేరు, స్టాఫ్ నెంబర్, పట్టుబడిన వారియొక్క గత చరిత్ర, etc,ఉంటాయి.  👉ఆ రిపోర్ట్ తో పాటు గా పట్టుబడిన  ఉద్యోగి స్పాట్ సంజాయిషీ, సాక్షి సంతకము తో లెటర్ రిపోర్ట్ కు జతపరిచి యూనిట్ ఆ...

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

*ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం* ఏపీ ఉద్యోగుల బదిలీపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల బదిలీల్లో అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. మరో ఏడు రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలివే.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయిన ఏపీ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేయనుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్‌మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ఏపీ ప్రభుత్వం ప్రాధా...